Ramdev Baba: రాందేవ్ బాబా వర్సెస్ అల్లోపతి, మరో కొత్త వివాదం

Ramdev Baba: అల్లోపతి వైద్య విధానంపై విమర్శలతో వివాదాస్పదమైన యోగా గురు రాందేవ్ బాబా అంతటితో ఆగలేదు. ఇప్పుడు మరోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు సూటైన ప్రశ్నలు సంధించారు. రాందేవ్ బాబా వేసిన ప్రశ్నలు మళ్లీ ఇప్పుడు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 25, 2021, 08:42 AM IST
  • అల్లోపతి వర్సెస్ రాందేవ్ బాబా, మరో కొత్త వివాదం
  • ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు 25 ప్రశ్నలు సంధించిన రాందేవ్ బాబా
  • ఆ రోగాలకు అల్లోపతిలో శాశ్వత పరిష్కారముందా అని ప్రశ్న
Ramdev Baba: రాందేవ్ బాబా వర్సెస్ అల్లోపతి, మరో కొత్త వివాదం

Ramdev Baba: అల్లోపతి వైద్య విధానంపై విమర్శలతో వివాదాస్పదమైన యోగా గురు రాందేవ్ బాబా అంతటితో ఆగలేదు. ఇప్పుడు మరోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు సూటైన ప్రశ్నలు సంధించారు. రాందేవ్ బాబా వేసిన ప్రశ్నలు మళ్లీ ఇప్పుడు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.

ఆయుర్వేద వైద్య విధానం(Ayurveda)వర్సెస్ అల్లోపతి(Allopathy)వైద్యం. ఎప్పట్నించో ఉన్న వివాదమే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు నేపధ్యంలో పెరిగి పెద్దదవుతోంది. అల్లోపతి వైద్యవిధానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పదమయ్యారు. అంతేకాదు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆగ్రహానికి గురయ్యారు. దాంతో క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా (Yoga guru Ramdev Baba)అంతటితో ఆగలేదు. మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని, కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు ( Indian medical association)యోగా గురువు రాందేవ్ బాబా 25 ప్రశ్నలు సంధించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివారికి శాశ్వత పరిష్కారం అల్లోపతి వైద్యంలో ఉందా అని ప్రశ్నించారు అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని...ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఆస్తమా వంటి రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారముందా అని ప్రశ్నించారు. మరోవైపు కొలెస్టరాల్, మైగ్రెయిన్, అమ్నీసియాకు ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని చికిత్స ఉందా అని ప్రశ్నించారు. గుండెలో ఏర్పడే రంధ్రాలకు నొప్పి లేకుండా చికిత్స అందించగలరా అని అడిగారు. వయస్సును వెనక్కి మళ్లేలా చేసి హీమోగ్లోబిన్‌ను పెంచే చికిత్స ఉందా అని నిలదీశారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే..వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా(Ramdev baba) అభిప్రాయపడ్డారు. 

Also read: Anandaiah medicine: కృష్ణపట్నం మందుపై త్వరలో క్లినికల్ ట్రయల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News