Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ వివరాలు ఇవ్వలేం : కేంద్ర ప్రభుత్వం
Pegasus Spyware: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పెగసస్ స్పైవేర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రతతో కూడుకున్న అంశమనే కారణంతో సుప్రీంకోర్టు విజ్ఞప్తిని నిరాకరించింది.
Pegasus Spyware: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పెగసస్ స్పైవేర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రతతో కూడుకున్న అంశమనే కారణంతో సుప్రీంకోర్టు విజ్ఞప్తిని నిరాకరించింది.
పెగసస్ స్పైవేర్(Pegasus Spyware) వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.మరోవైపు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తావించిన అంశాలు ఆసక్తిగా మారాయి.స్పైవేర్ వినియోగంపై వివరాలు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది దేశభద్రతతో కూడుకున్న అంశమని తెలిపింది
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)నోటీసులు జారీ చేయడమే కాకుండా విచారణను పది రోజులకు వాయిదా వేసింది.పెగసస్ గూఢచర్యం ఆరోపణల్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.పెగసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కొట్టిపారేసింది.పెగసస్‌పై నిజాల్ని నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు కానుంది.
Also read: Karnataka: బెంగళూరులో పెరుగుతున్న కంటైన్‌మెంట్ జోన్లు, ఎక్కువగా అపార్ట్‌మెంట్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook