Karnataka: బెంగళూరులో కంటైన్‌మెంట్ జోన్లు పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లు కరోనా వైరస్‌కు నిలయాలుగా మారుతున్నాయి. బెంగళూరులో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru) పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. నగరంలోని చాలా అపార్ట్‌మెంట్లలో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది. అత్యధిక శాతం అపార్ట్‌మెంట్‌లు కంటైన్‌మెంట్ జోన్‌లుగా మారుతున్నాయి. బెంగళూరు సరిహద్దు వార్డులు డేంజర్ జోన్లుగా మారుతున్నాయి. జనాభా అధికంగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. జనసాంద్రత తక్కువగా ఉండే బెంగళూరు నగర శివార్లలో కరోనా సంక్రమణ పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలో 172 కంటైన్ మెంట్ జోన్లుండగా..అందులో 80 అపార్ట్‌మెంట్‌లే ఉన్నాయి. ఒక్క మహాదేవపురలోనే 49 కంటైన్‌మెంట్ జోన్లున్నాయి. ఇక బేగూరు, బళ్లందూరు, రాజరాజేశ్వరి నగర, హూడి, హగదూరు, హోరమావు, బసవపుర, విజ్ఞాననగర, విద్యారణ్యపుర ప్రాంతాలు డేంజర్ జోన్లుగా ఉన్నాయి. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) ముప్పు, చిన్నారులు కరోనా బారిన పడుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వీకెండ్ లాక్‌డౌన్(Lockdown)విధించే యోచనలో ఉంది.
Also read: Flying Car: త్వరలో ఇండియాలో మేకిన్ ఇండియా ఫ్లైయింగ్ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook