Public Exams: కేంద్ర విద్యా విధానంలో కీలకమైన మార్పులొచ్చాయి. 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షల్లో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. విద్యాహక్కు చట్టంలో సవరణలు చేసింది. కేంద్రీయ విద్యాలయ విధానంలో మార్పులు రానున్నాయి. ఈ కొత్త మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు, సవరణల ప్రకారం 5, 8 తరగతులకు ఇకపై పబ్లిక్ పరీక్షలుంటాయి. అంటే ఫెయిల్ అయితే ప్రమోట్ చేసేందుకు అవదు. రెండు నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా ఫెయిల్ అయితే అవే తరగతుల్లో కొనసాగాల్సి వస్తుంది. అయితే ఫెయిల్ అయ్యారనే కారణంతో స్కూల్ నుంచి తొలగించకూడదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 3 వేల విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూల్స్ విద్యా సంస్థలకు ఈ మార్పులు వర్తిస్తాయి. ఈ మేరకు 2019 విద్యా హక్కు చట్టంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం.


Also read: Train Tickets Subsidy: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, రైల్వే టికెట్లపై సబ్సిడీ ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.