Ban on Dogs: కొందరు ఇష్టం కొద్దీ పెంచుకుంటే మరి కొందరు రక్షణ కోసం పెంచుకుంటుంటారు. రక్షణ కోసం పెంచుకునే క్రమంలో పరిధి దాటుతున్నారు. విదేశాల్నించి ప్రమాదకరమైన జాతులకు చెందిన కుక్కల్ని సైతం దిగుమతి చేసుకుని పెంచుకుంటున్నారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది. రక్షణ పేరుతో తీసుకొస్తున్న ప్రమాదకరమైన జాతికి చెందిన కుక్కల వల్ల మనిషి ప్రాణాలకే మప్పు ఏర్పడుతోంది. అందుకే ఈ కుక్కల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ PETA ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు అభ్యర్దించింది. చట్ట విరుద్ధమైన ఫైటింగ్, కొన్ని జాతుల కుక్కల వల్ల జరుగుతున్న దాడులు, ప్రాణాలు తీస్తున్న కుక్కల నుంచి కాపాడాలనేది ప్రధాన విజ్ఞప్తి. దేశంలో పలు ప్రాంతాల్లో పిట్‌బుల్స్ వంటి ప్రమాదకరకమైన కుక్కల వల్ల ప్రజలకు తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల పిట్‌బుల్ కుక్క దాడి కారణంగా 17 ఏళ్ల పసిబిడ్డ ఆసుపత్రిపాలైంది. మరో ఘటనో పొరుగువారిపై దాడి చేసేలా యజమని రెచ్చగొట్టడంతో 10 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థూలంగా చెప్పాలంటే కొన్ని రకాల కుక్కల వల్ల మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. అందుకే పిట్‌బుల్ తరహా కుక్కల్ని నిషేధించాలని పెటా విజ్ఞప్తి చేసింది. 


పెటా అభ్యర్ధనలో వాస్తవాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని జాతి కుక్కల్ని నిషేధించాలని యోచిస్తోంది. ఇల్లీగల్ ఫైటింగ్, దాడులకు ఉపయోగించే విదేశీ జాతి కుక్కల అమ్మకం లేదా పెంచుకోవడంపై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శలుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. మనిషి ప్రాణాలకు ప్రమాదంగా మారిన పిట్‌బుల్స్ వంటి జాతి కుక్కల అమ్మకం, పెంపకం కోసం లైసెన్సులు కూడా జారీ చేయవద్దని కోరింది. 


ఇండియాలో నిషేధించనున్న కుక్క జాతులు ఇవే


పిట్‌బుల్ టెర్రియర్లు, టోసా ఇషు, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసీలెరియో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోయర్ బోయెల్, కంగల్, షెఫర్డ్ డాగ్స్, టోర్న్‌జాక్, బాండోక్, సర్ప్లా నినాక్, జపనీస్ తోసా, అకిటా, మాస్టిఫ్స్, రోట్ వీలర్స్, డొడేషియన్ రిడ్జ్ బ్యాక్, ఓల్ఫ్ డాగ్స్, కానారియో, ఆక్వాష్, గార్డ్‌డాగ్ జాతి కుక్కలపై నిషేదం వేటు పడనుంది. 


Also read: Supreme Court: ఈసీ నియామకాలపై సుప్రీంలో అత్యవసర విచారణ, ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభావం పడనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook