ఇప్పుడంతా అన్ లాక్ ( Unlock 4) ప్రక్రియే నడుస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా తెర్చుకుంటున్నాయి. ఇక అందరూ ఎదురూచూస్తున్నది మెట్రో సర్వీసులు, స్కూల్స్ ప్రారంభం ఎప్పుడనే విషయంపైనే. సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ( Metro services ) ప్రారంభించనున్నారా ? కేంద్రం ఏం ఆలోచిస్తోంది ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అన్ లాక్ 4 ( Unlock 4 ) సెప్టెంబర్ 1 ( From september 1 ) నుంచి ప్రారంభం కానుంది. అన్ లాక్ 3 ( Unlock 3 ) లో జిమ్స్, యోగా సెంటర్లు తెర్చుకోవడానికి అనుమతి లభించింది. ఇప్పుడందరి దృష్టీ మెట్రో సర్వీసులు, స్కూల్స్ పైనే ఉంది. తాజాగా షరతులతో కూడిన షూటింగ్ లకు అనుమతి లభించింది. ఇక ప్రధానంగా ప్రారంభం కావల్సింది మెట్రో రైళ్లు ( metro trains ) , స్కూల్స్ ( Schools ) మాత్రమే. కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా లాక్ డౌన్ ( lockdown ) ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో మెట్రో సర్వీసులు మొత్తం నిలిపివేశారు. కరోనా వైరస్ కారణంగా ఒక్క ఢిల్లీ మెట్రోకే 13 వందల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అన్ లాక్ 4 లో  మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm Aravind kejriwal ) ఇప్పటికే కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా సరే...రికవరీ రేటు కూడా పెరుగుతుండటంతో మెట్రో రైళ్లు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్ర హోంశాఖ రూపొందిస్తన్నట్టు సమాచారం. అయితే స్కూల్స్ కు మాత్రం అప్పుడే అనుమతి లభించకపోవచ్చు. 


ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 31 లక్షలు దాటగా..యాక్టివ్ కేసులు మాత్రం  7 లక్షల 10 వేలున్నాయి. మొత్తం మీద రికవరీ రేటు75.3 శాతంగా ఉంది. మరణాల రేటు కూడా దేశంలో కేవలం 1.9 శాతమే ఉంది. ఈ నేపధ్యంలో అన్ లాక్ 4లో మెట్రో సర్వీసుల్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. Also read: Rahul Gandhi Comments: నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆజాద్