భారత దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో భారత ప్రభుత్వం టీకా తయారీ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తోంది. వచ్చే ఏడాది నాటికి సుమారు 400 నుంచి 500 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయి అని కేంద్రం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం


మంగళవారం నాడు ఢిల్లీలో వివిధ శాఖల మంత్రులతో భేటీలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రస్తుతం దేశంలో, అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి.. దాంతో పాటు వ్యాక్సిన్ గురించి చర్చించారు. 


కోవిడ్-19 టీకా ( Covid-19 ) అందిరికీ సకాలంలో అందాలి అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దీని కోసం శాస్త్రీయంగా అన్ని ప్రయత్నాలు జరగాలి అని మంత్రి తెలిపారు. 



Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!


వ్యాన్సిన్ నిల్వ చేయడానికి అవసరమైన టెంపరేచర్ స్టోరేజ్ ఫెసిలిటీ, జియో ట్యాగ్ అయిన ఆరోగ్యకేంద్రాలు, వ్యాక్సిన్ స్టాక్ పరిస్థితి వంటి అంశాలు చాలా కీలకం అని ప్రభుత్వం తెలిపింది.


వీరికే తొలి ప్రాధాన్యత..
కోవిడ్-19 టీకా పంపిణి విషయంలో ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతంది అని ప్రభుత్వం తెలిపింది. ఎవరికైతే అత్యవసరమో వారికి ముందు ఇవ్వడం జరుగుతుంది అని.. ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేసిన జాబితాను కూడా పరిగణలోకి తీసుకుంటాం అని తెలిపింది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR