Chairperson of dcw swati maliwal inquired for spa on justdial then got rate list of callgirls: స్పాలలో వ్యభిచారపు రాకెట్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి వీలుగా ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women) (DCW)జస్ట్‌ డయల్‌కు (justdial) సమన్లు జారీ చేసింది. జస్ట్ డయల్ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని స్పాలలో (Spa in Delhi) నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్లపై ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జస్ట్ డయల్ పై దర్యాప్తు చేసేందుకు కమిషన్ ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. దక్షిణ ఢిల్లీలో ఉన్న స్పాల వివరాలను ఇవ్వాలని కమిషన్ బృందం కోరింది. అయితే 24 గంటల్లోనూ కొన్ని స్పాల బాగోతాలపై మహిళా కమిషన్‌కు చాలా కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. 


అయితే కమిషన్ బృందం (Commission team) స్పా సేవల వివరాలను అందించాలని అభ్యర్థించగా.. అమ్మాయి కోసం అభ్యర్థనగా భావించి స్పాల మాటున సాగిస్తున్న అక్రమ వ్యభిచార కార్యకలాపాలకు (prostitution activities) సంబంధించిన వివరాలను వెంటనే అందించారు. దీంతో స్పాల మాటున వ్యభిచారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిపై కేసులు నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను (Crime Branch‌) కమిషన్ కోరింది. ఈ స్పాలలో 150 కంటే ఎక్కువ మంది యువతుల ఫోటోలతో పాటు వారి సేవలకు సంబంధించిన రేట్లను కూడా ఇచ్చారు.


Also Read : Bholaa Shankar: చిరంజీవి భోళా శంక‌ర్ నుంచి అప్‌డేట్‌.. 11న మూహుర్తం..


జస్ట్‌ డయల్ (justdial) మేనేజ్‌మెంట్‌ని పిలిపించి వారు జాబితా చేసిన స్పాల తనిఖీల కోసం వారి విధానాన్ని వివరించమని ఢిల్లీ మహిళా కమిషన్ కోరింది. లైంగిక సేవలను అందించడానికి కమిషన్ బృందానికి సందేశాలను పంపిన స్పాల వివరాలను, అలాగే వారి సైట్‌లో జాబితా చేసేందుకు జస్ట్‌ డయల్ ఎంత తీసుకుంది వంటి వివరాలు అందించమని కూడా కమిషన్ కోరింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నవంబరు 12వ తేదీలోగా పూర్తిస్థాయి చర్యల నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. 


రాజధానిలో వ్యభిచార రాకెట్‌లు నిర్వహిస్తుండటం ఆశ్చర్యకరమని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ (Swati maliwal) పేర్కొన్నారు. ఈ విషయంలో వారి పాత్రను విచారించడానికి మేం జస్ట్‌ డయల్‌ను పిలిపించామన్నారు. వెంటనే జస్ట్ డయల్ పై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి అరెస్టు చేయాలని ఢిల్లీ (Delhi) లీసులకు నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు.


Also Read : Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు అసహనం, అసంతృప్తి.. కారణమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook