Lakhimpur Kheri: వివాదాస్పద లఖీంపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయకమీషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమీషన్‌పై విశ్వాసం లేదని తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ(Lakhimpur Kheri) ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు యూపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమీషన్ విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తును నిష్ఫక్షపాతంగా, న్యాయబద్ధంగా ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తానని సుప్రీంకోర్టు తెలిపింది. అటు యూపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమీషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. లఖీంపూర్ ఖేరీ ఘటనపై ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Justice nv Ramana), జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలపై ధర్మాసనం విచారించింది. హర్యానా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్ రాకేష్ కుమార్ జైన్ లేదా జస్టిస్ రంజిత్ సింగ్‌లలో ఒకరిని నియమిస్తామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును పర్యవేక్షించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమీషన్‌పై విశ్వాసం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు(Supreme Court).
ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవతో కూడిన ఏకసభ్య న్యాయ కమిషన్ యూపీ ప్రభుత్వం(Up Government) ఏర్పాటు చేసింది. రైతులపై నుంచి వాహనం దూసుకెళ్లడం, రైతుల ఆగ్రహించి బీజేపీ కార్యకర్తలను హతమార్చిన వేర్వేరు ఘటనలపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ సాక్షుల విచారణ కలిపి జరుగుతోందని భావిస్తున్నామని.. ప్రత్యేకించి ఒక నిందితుడిని కాపాడడానికే ఇలా జరుగుతోందని అనిపిస్తోందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అందుకే కేసులో ఆధారాలు మిళితం కాలేదని నిర్ధారించేందుకు, దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ జడ్జిని నియమించాలని భావిస్తున్నామని పేర్కొంది. ఈ వ్యవహారంపై శుక్రవారంలోగా యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ధర్మాసనం కోరింది..
ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నిందితుడిగా ఉన్నారు. ఘటనలో రైతుల హత్య, జర్నలిస్టు హత్య, రాజకీయ కార్యకర్తల హత్య ఇలా మూడు విభాగాలున్నాయి. మూడవ కేసుకు సంబంధించి పరిశోధన సిట్ కొనసాగించలేకపోతోందని అనుకుంటున్నామని.. ఇలాంటి గందరగోళంలో స్వతంత్ర న్యాయమూర్తుల పర్యవేక్షణే సబబని భావిస్తున్నామని సుప్రీంకోర్టు(Supreme Court)స్పష్టం చేసింది.
Also read: Chhath Puja in Yamuna Pollution: విషపూరిత ఫోమ్..అత్యంత ప్రమాదకరమైనా తప్పని పవిత్ర స్నానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook