ఢిల్లీ: మోడీ సర్కార్ ఎండగట్టేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని జారవిడకుండా ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు. ఈ రోజు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా చేపట్టిన కేజ్రీవాల్ ధర్నాలో పాల్గొన్న చంద్రబాబు ..మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు సంధించారు. ప్రధాని మోదీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవంటూ ఎద్దేవ చేశారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారితో   ప్రజాస్వామ్యాన్ని  పరిరక్షించాలని చంద్రబాబు నినదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోడీ పాలనలో హక్కులు కోల్పోయాం..


మోడీ పాలనలో జనాలు ప్రాథమిక హక్కులు కోల్పోయే పరిస్ధితి వచ్చిందని దయ్యబట్టారు. బీజేపీ పాలనో అన్నివర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దుతో ఆర్థిక రంగం కుదేలైపోయిందని..ఈ నిర్ణయంతో ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్  పరిపాలనను ప్రశంసించిన చంద్రబాబు ..ఢిల్లీ సీఎంగా  కేజ్రీవాల్ అద్భుతాలు చేశారని కొనియాడారు.