Chief justice of india DY Chandrachud shared he was caned in class 5 th class: బాల్యం అనేది మనిషిజీవితంలో అత్యంత ముఖ్యమైనదని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ అన్నారు. ఆయన ఇటీవల ఖాట్మాండులో జరిగిన జువైనల్ జస్టిస్ నేషనల్ సింపోజియం సదస్సులో పాల్గొన్నారు. ఈ సెమినార్ లో మాట్లాడుతూ.. బాల్యం మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలు, ఎదుర్కొన్న అనుభవాలు మన మనస్సుకు హత్తుకుపోతాయన్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలను దండించడం కొందరు క్రూరమైన పద్ధతిగా భావిస్తున్నారని అన్నారు. కానీ ఒకప్పుడు చిన్న తప్పులకు కూడా పెద్ద పనిష్మెంట్ ఇచ్చేవారని తన చిన్నతనంలో ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..


ఐదవ తరగతిలో ఉన్నప్పుడు టీచర్లు ఒక అసైన్ మెంట్ ఇచ్చారని, కానీ తాను కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఇచ్చిన వర్క్ ను మరోలా చేశారని తెలిపారు. దీంతో తనటీచర్ తన చేతిని బత్తెంతో బాదేశాడని చెప్పారు. నేను దెబ్బలకు తాళలేక..కావాలంటే నా వీపు కింది భాగంలో కొట్టండి. కానీ చేయిమీద కొట్టొద్దంటూ ప్రాధేయపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయిన కూడా టీచర్ తనచేతుల మీద కర్రతో కొట్టడం వల్ల చేతులన్ని వాచీపోయాయన్నారు.  అంతేకాకుండా ఒక పదిరోజుల పాటు తన చేతులను ఇంట్లో వాళ్లకు కన్పించకుండా జాగ్రత్తలుకూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో నేను ఐదవ తరగతిలో ఉన్నాను. కానీ నా మనస్సు ఎంతో బాధపడిందని, ఆ చెదు అనుభవం ఇప్పటికి వెంటాడుందని అన్నారు.


అయితే.. బాల్యం అనేది అత్యంత విలువైదని, పిల్లలను స్కూల్ లలో కానీ, ఇంట్లో కానీ మనస్సుకు బాధపట్టేలా ప్రవర్తించకూడదన్నారు. చిన్న తనంలో కల్గిన అనుభావాలే పెద్దాయ్యాక.. మంచి వాళ్లు లేదా సమాజంలో నేరాలకు పాల్పడేలా చేస్తాయని చీఫ్ జస్టిస్ అన్నారు. అందుకే బాల్యంలో చిన్న పిల్లలను చక్కగా చూసుకుంటూ ఉండాన్నారు. తప్పులు చేస్తే సున్నితంగా చెప్పాలని, అర్థం అయ్యేలా వివరించాలన్నారు.


Read more: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?


ఇక చిన్నతనంలో తెలిసీ, తెలియక నేరాలు చేసిన జువైనల్ జైలుకు వచ్చిన పిల్లలకు అవగాహాన కల్పించాలని, పిల్లలను సరైన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ సెమినార్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమాజంలో ఒక పెద్ద సవాలు ఏమిటంటే, మౌలిక సదుపాయాలు,  వనరులు సరిపోకపోవడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అధిక రద్దీ,  నాసిరకం బాల్య నిర్బంధ కేంద్రాలకు దారితీసిందని డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter