China is the biggest security threat facing India: భారత్-చైనా మధ్య గత ఏడాది నుంచి​ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ (CDS General Bipin Rawat) కీలక విషయాలు వెల్లడించారు. భారత్​కు పాకిస్థాన్​ కంటే.. చైనానే అతిపెద్ద భద్రత ముప్పుగా పరిణమించిందని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కారణంగానే.. గల్వాన్ ఘటన (Galwan clash) తర్వాత గత ఏడాది దేశ సరిహద్దుల్లో మోహరించిన సైన్యం, తరలించిన ఆయుధ సామాగ్రి ఇప్పట్లో వెనక్కి రాలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.


లభించని పరిష్కారం..


ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఫలితాలను ఇవ్వడం లేదని బిపిన్ రావత్ పేర్కొన్నారు. ఇందుకు ఇరు దేశాల మధ్య విశ్వాస లోపం, అనుమానాలే కారణమని కూడా వివరించారు. వివాదం పరిష్కారం కోసం గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఇటీవల 13వ రౌండ్ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు పురోగతి లభించలేదని తెలిపారు రావత్​.


Also read: Norovirus: కేరళలో నోరో వైరస్ కలకలం..అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం..


Also read: Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..


పాక్ సరిహద్దుల్లో ఉగ్రముప్పు?


గల్వాన్ ఘటన తర్వాత ఇటు భారత్, అటు చైనా.. సరిహద్దుల వెంబడి.. ఆయుధాలు, బలగాలను పెద్ద ఎత్తున మోహరించుకున్నట్లు బిపిన్ రావత్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు ఎర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.


ఇదిలా ఉండగా.. అఫ్గాన్ తాలిబన్లతో భద్రతాపర సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నంది పేర్కొన్నారు. తాలిబన్లు మళ్లి విజృంభిస్తే.. పాక్​లో ఉగ్రశక్తులకు ఊతమందినట్లేనని అభిప్రాయపడ్డారు. అప్పుడు చైనాతో పాటు.. పాక్ సరిహద్దుల వెంబడి కూడా భద్రతపరమైన ఇబ్బందులు ఏర్పడొచ్చని పేర్కొన్నారు రావత్​. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రెండు వైపుల సైన్యాన్ని మోహరించాల్సిన అవసరముంటుందని వివరించారు.


Also read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ


Also read: HD Kumaraswamy: 'జన్​ ధన్​ ఖాతాలు హ్యాక్​ చేసి రూ.6 వేల కోట్లు కొల్ల గొట్టారు.. ఈ విషయం ప్రధానికి తెలిసే ఉంటుంది'


ఐటీ చట్టాల్లో మార్పులు అవసరం..


పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా దేశ ఐటీ చట్టాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు బిపిన్​ రావత్. కేరళ పోలీసులు వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన 14వ 'హ్యాకింగ్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ' అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.


సైబర్ నేరాల గురించి ప్రస్తావిస్తూ.. గత ఏడాది కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగినట్లు చెప్పారు రావత్. ముఖ్యంగా కొవిడ్ సమయంలో 500 శాతం వృద్ధి నమోదైందని నివేదికలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


సైబర్​ భద్రతకు సంబంధించి.. జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేక ఫ్రేమ్ వర్క్ అవసరమని రావత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సైబర్ భద్రతకు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో వివిధ శాఖలు, నిపుణులు, ఇతర విభాగాలు పని చేస్తున్నాయన్నారు. అయితే ఇప్పుడు సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా.. ఐటీ చట్టం  2000లో సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. దీనితో పాటు డేటా ప్రొటెక్షన్​ బిల్లు వీలైనంత త్వరగా చట్ట రూపం దాల్చాలని పేర్కొన్నారు.


Also read: Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..


Also read: Kangana Ranaut Freedom 2014: కంగనా రనౌత్ ఓ బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook