Norovirus: కేరళలో నోరో వైరస్ కలకలం..అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం..

కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. ఓ వెటర్నరీ కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో ఈ వైరస్ ను గుర్తించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 06:53 PM IST
Norovirus: కేరళలో నోరో వైరస్ కలకలం..అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం..

Norovirus Cases reported in Kerala: కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. నోరో వైరస్​గా(norovirus transmission) పిలుస్తున్న ఈ వ్యాధి.. రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకింది. ఆ విషయాన్ని ఆ రాష్ట్రఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నిర్ధారించారు. ఈ వ్యాధి సోకిన వారందరూ వయనాడ్​ జిల్లా(Wayanad district) పూకోడేలోని వెటర్నరీ కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది. 

వాంతులు, డయేరియా(diarrhea.)ను ఈ వైరస్​(norovirus 2021) లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. నోరో వైరస్(Kerala virus outbreak)​ అనేది అరుదైన వ్యాధి. కళాశాల క్యాంపస్​ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్​ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజ(Alappuzha)లోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్​ఐవీ)కి పంపించారు.

Also Read: Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..

తాజా పరిస్థితులపై అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్(Veena George)​ సమావేశమయ్యారు. వైరస్​ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సూపర్ క్లోరినేషన్ జరుగుతోందని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News