High Court Jobs: నిరుద్యోగ న్యాయవాదులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 22 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ హైకోర్టులో(Ap High Court) సివిల్ జడ్జి పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. హైకోర్టులో మొత్తం 22 పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల్నించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. లా లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో 18 పోస్టులు, ట్రాన్స్‌ఫర్‌లో 4 పోస్టులు భర్తీ కానున్నాయి. 2021 జూలై 1 నాటికి  35 ఏళ్లు మించకూడదు. నెలసరి వేతనం 27 వేల నుంచి 44 వేల 770 వరకూ ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తారు. 


షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్ధులకు వంద మార్కులకు కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. 40 శాతం పైగా మార్కులు సాధించిన అభ్యర్ధుల్ని ప్రతి పదిమందిలో ఒకరి చొప్పున రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మూడు పేపర్లుంటాయి. సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లీషు ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ఎస్సై రైటింగ్ టెస్టు ఉంటాయి. ప్రతి పేపర్ వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు కాగా, వైవా వాయిస్ 50 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు(Online Applications) చివరి తేదీ 2021 ఆగస్టు 30 గా ఉంది. సెప్టెంబర్ 15వ తేదీన హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ అక్టోబర్ 3వ తేదీన ఉంటుంది. వెబ్‌సైట్  hc.ap.nic.in ఆధారంగా దరఖాస్తు చేయాలి. 


Also read: చిక్కుల్లో బైజుస్, యజమాని రవీంద్రన్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook