దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ ( Corona virus ) సెకండ్ వేవ్ ( Second wave ) ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం రెండో దశకు సంకేతమని సాక్షాత్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm arvind kejriwal ) స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఢిల్లీ ( Delhi ) లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. సెప్టెంబర్ నెల ప్రారంభంలో అనూహ్యంగా రోజుకు 4 వేల కేసులు దాటడం సెకండ్ వేవ్ కు ఉదాహరణగా చెప్పారు.  కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమైందని ప్రకటించిన తొలి రాష్ట్రం ఢిల్లీ కావడం విశేషం. దేశ రాజధానిలో ఇంతలా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే పరిణామమని ఆయన చెప్పారు.
సెప్టెంబర్ నెల 16 వ తేదీన  4వేల 5 వందల కేసులు వెలుగు చూడగా...తరువాత క్రమంగా తగ్గాయి. అయితే గత 24 గంటల్లో మళ్లీ 3 వేల 7 వందల కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 9వ తేదీన తొలిసారి 4 వేల కేసులు దాటాయి. అదే రోజు 20 మంది మరణించారు.  వైరస్ దేశ రాజధానిని తాకిన అనంతరం  అత్యధికంగా  సెప్టెంబర్ 16న 4 వేల 473 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 57 లక్షల కేసులు దాటాయి. 91 వేల మంది మృతి చెందారు. గత 24 గంటల్లో అయితే 1129 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: 
Narottam Mishra: మాస్కు ధరించను.. అయితే ఏమైంది?.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం