CM KCR slams Central Govt: హైదరాబాద్‌: ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో  ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) కూడా కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు తేనె పూసిన కత్తిలా ఉందని.. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ఓటు వేయాలని ఎంపీ కేశవరావుకు, పలువురు ఎంపీలకు శనివారం దిశానిర్దేశం చేశారు. Also read: Agricultue Bills: 25న భారత్ బంద్!.. మూడు రోజులపాటు రైల్‌రోకోకు పిలుపు


కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఈ బిల్లును రూపొందించారని విమర్శించారు. ఇది అమల్లోకి వస్తే రైతుల పరిస్థితి దారుణంగా మారుతుందని కావున దీనిని వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాస్తవానికి రైతులు ఎక్కడికైనా వెళ్లి పంట అమ్ముకోవచ్చని.. కానీ అలాకాకుండా కార్పొరేట్‌కు అవకాశమివ్వడం బాధకరమన్నారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50శాతం పన్ను అమలులో ఉందని.. ఆ పన్నును 15 శాతానికి తగ్గించి దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోందని.. దీనివల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని సీఎం కేసీఆర్ చెప్పారు. కావున ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని సీఎం ఎంపీలకు ఆదేశించారు.  Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం