Hathras case: వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు: సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దుర్మార్గపు ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆతర్వాత బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతించకుండా పోలీసులే అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు.
CM Yogi Adityanath breaks silence on Hathras gang-rape case: ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras ) లో జరిగిన దుర్మార్గపు ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆతర్వాత బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతించకుండా పోలీసులే అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు. దీనిపై విపక్ష పార్టీలన్నీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని చుట్టుముడుతూ.. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే హత్రాస్ ఘటనతోపాటు రాష్ట్రంలో బలరాంపూర్, బులంద్‌షహర్, అజమ్‌గఢ్‌లో ఇలాంటి కేసులే వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) శుక్రవారం మౌనాన్ని వీడారు. తమ ప్రభుత్వం మహిళల భద్రతకు కట్టుబడి ఉందని యోగి స్పష్టంచేస్తూ.. ట్వీట్ చేశారు.
తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి అన్నారు. మహిళలకు హానీ చేయాలని భావించే వారు తప్పకుండా తీవ్ర పరిణామాలను ఎదుర్కొటారని పేర్కొన్నారు. వారికి ఎలాంటి శిక్ష లభిస్తుందంటే.. అది చూసి భవిష్యత్తులో మరేవ్వరు కూడా ఆడవారికి హానీ కలిగించాలని కలలో కూడా ఊహించరని యోగి తెలపారు. సోదరీమణులు, తల్లుల భద్రత, పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇదే మా నిబద్ధత, వాగ్దానం అంటూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందీలో ట్వీట్ చేశారు. Also read: Hathras Case: నిన్న రాహుల్ గాంధీ.. నేడు డెరిక్ ఓబ్రెయిన్.. అలాగే కిందపడేశారు!
హత్రాస్ బాధితురాలు అత్యాచారానికి గురై సెప్టెంబరు 14 నుంచి ప్రాణాలతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో 29న మంగళవారం కన్నుమూసింది. ఆ రోజే పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతి లేకుండా పోలీసులు అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. హైదరాబాద్ దిశా (Disha) నిందితుల తరహాలో నేరస్థులను ఎన్‌కౌంటర్ చేయాలని.. విపక్షాలన్నీ యూపీ బీజేపీ యోగి ప్రభుత్వాన్ని (Yogi Government) చుట్టుముడుతున్నాయి. Also Read : Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ