Students drinks condoms water for intoxication in Durgapur: కండోమ్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృంగారంలో పాల్గొన్నప్పుడు అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి రక్షణ ఇచ్చేదే కండోమ్‌. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కండోమ్‌ను శృంగారానికి కాకూండా.. మరో విధంగా కూడా ఉపయోగిస్తున్నారట. దాంతో కొంతమంది యువతకి కండోమ్‌ ఓ వ్యసనంగా మారిందట. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఏం జరుగుతుందని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా దుర్గాపూర్‌లోని పలు ప్రాంతాలైన దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్‌ నగర్, బెనచిటి, ముచిపర, సి జోన్, ఎ జోన్‌లలో ఫ్లేవర్ కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. యువత భారీ మొత్తంలో కండోమ్‌లను కొనుగోలు చేశారు. ఒక్కోసారి కొందరు బల్క్ మొత్తంలో కొనుగోలు చేశారట. ఇంత మొత్తంలో ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఓ షాపు యజమానికి అనుమానం వచ్చి తన రెగ్యులర్ కస్టమర్ అయిన ఒక యువకుడిని అడగగా.. మత్తు కోసం కండోమ్‌లు కొంటున్నానని చెప్పాడట. దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడట. విషయం తెలుసుకున్న దుర్గాపూర్ ప్రజలు అవాక్కయ్యారు. 


షాఫులో కొనుగోలు చేసిన కండోమ్‌లను దుర్గాపూర్‌లోని కొందరు యువకులు వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతున్నారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్‌లను తీసేసి తాగుతున్నారు. ఆపై మత్తులో ఊగిపోతున్నారట. దుర్గాపూర్‌లోని చాలా మంది యువకులు దీనికి బానిసలుగా మారారు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. విషయం తెలిసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 


దుర్గాపూర్ డివిజనల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ధీమాన్ మండల్ మాట్లాడుతూ.. కండోమ్‌లలో సుగంధ సమ్మేళనాలు ఉంటాయని, అవి ఆల్కహాల్‌గా మారుతుందన్నారు. ఈ సుగంధ సమ్మేళనం డెండ్రైట్స్ జిగురులో కూడా ఉంటుందని, దానికి అందరూ వ్యసనం అవుతారన్నారు. దుర్గాపూర్ ఆర్ఈ కాలేజ్ మోడల్ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ నూరుల్ హక్ మాట్లాడుతూ.. వేడి నీటిలో కండోమ్‌లను దీర్ఘకాలికంగా నానబెట్టడం వల్ల ఆర్గానిక్ అణువులు ఆల్కహాలిక్ సమ్మేళనాలుగా విచ్ఛిన్నం అయి మత్తు వస్తుందని పేర్కొన్నారు. 


Also Read: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?


Also Read: Man Vs Wild: నేను దృఢంగా, శక్తి వంతంగా ఉండడానికి కారణాలు ఇవే: బియర్ గ్రిల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.