ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ డ్రగ్స్క్ తీసుకునే అలావాటు ఉందని.. ముందు ఆయనకు డోప్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక వేళ పరీక్ష నిర్వహిస్తే రాహుల్ అందులో తప్పక ఫెయిల్ అవుతారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


పంజాబ్ సర్కార్ నిర్ణయంపై బీజేపీ ఎంపీ స్వామి సీరియస్ గా స్పందించారు. పంజాబ్ లో డ్రగ్స్ తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. వాస్తవానికి ఆ పార్టీలోనే ఎక్కువ మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు..  ముందు వారికి డోపింగ్ టెస్టులు నిర్వహించాలని ఎద్దేవా చేశారు. మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి డోప్ టెస్టు నిర్వహించాలని పంజాప్ సీఎంకు స్వామి చురకలు అంటించారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారు కాబట్టి... డోప్ టెస్టులో కచ్చితంగా ఆయన విఫలమవుతారని స్వామి ఎద్దేవ చేశారు.