కాంగ్రెస్‌ పార్టీ (Congress) జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆదివారం మధ్యాహ్నం ఆ‍స్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా వైద్య పరీక్షల (Sonia Gandhi Health Condition) నిమిత్తం జులై 30న ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. 73 ఏళ్ల సీనియర్ నాయకురాలు రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసం గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరారని హాస్పిటల్ చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సోనియాను డిశ్ఛార్జ్ చేసినట్లు వెల్లడించారు. UP: కరోనాతో మంత్రి కమల్‌రాణి మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్ఛార్జ్ చేశామన్నారు. కాగా, గురువారం నాడు దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు, దాని ప్రభావంపై చర్చించేందుకు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులతో గురువారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసం గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..


కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి రావడంతో గంగారామ్ ఆసుపత్రిలోనే చేరి చికిత్స పొందారు. ఆ సమయంలో పార్టీ నేతలు సోనియా ఆరోగ్యం పట్ల ఆందోళనకు గురయ్యారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్ 
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos