Sonia Gandhi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిమర్శ కొనసాగుతోంది.తాజాగా ఎన్నికల్లో ఓడిన ఐదురాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు తమ పదవి నుంచి వైదొలగాలని కోరారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణాలు అన్వేషిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో సమూల ప్రక్షాళన అవసరమని భావిస్తోంది. ఈ బాధ్యతను అధ్యక్షురాలు సోనియాగాంధీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ తాజా ఆదేశాలు జారీచేశారు. రాజీనామా చేసిన వారి స్థానంలో పార్టీ యువనేతలకు అవకాశమిస్తుందని భావిస్తున్నారు.


 అటు ఐదురాష్ట్రాల ఎన్నికల ఓటమిపై ఇటీవలే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే గాంధీ కుటుంబం పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతామని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ సభ్యులు తిరస్కరించారు. రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్షబాధ్యతలు స్వీకరించాలని కోరారు. అప్పటిదాకా సోనియాగాంధీ పదవిలో కొనసాగాలన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో కొత్త అధ్యక్ష ఎన్నిక జరపాలని సీడబ్ల్యూసీలో నిర్ణయించారు.


Also read: Mobile Phones Usage In Office: ఆఫీసులో ఉద్యోగులు ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు


Also read: Hijab Row: సుప్రీంకు హిజాబ్​ వివాదం- కర్ణాటక హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook