Congress Chintan Shivir: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేనా..?
Congress Chintan Shivir: దేశంలో కాంగ్రెస్ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఉదయ్‌పూర్ నవ సంకల్ప్ చింతన్ శివిర్‌తో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ వేదిక నుంచి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Congress Chintan Shivir: దేశంలో కాంగ్రెస్ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఉదయ్‌పూర్ నవ సంకల్ప్ చింతన్ శివిర్‌తో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ వేదిక నుంచి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పాదయాత్రల ద్వారా ప్రజల దగ్గరకు చేరాలని నిర్ణయించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో మహా పాదయాత్రలు చేపట్టనున్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవసంకల్ప్ చింతన్ శివిర్ ముగిసింది. ఈసందర్భంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ సుదర్ఘీంగా ప్రసంగించారు. గాంధీ జయంతి సందర్బంగా రాబోయే అక్టోబర్ 2 నుంచి పాదయాత్రలు కొనసాగుతాయని సోనియా గాంధీ ప్రకటించారు. పాదయాత్రల్లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలన్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. చింతన్ శివిర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదని మండిపడ్డారు. దేశంలో కోట్లాది మందికి సమస్యలపై అవగాహన లేదని..వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం టికెట్లు యువతకేనని స్పష్టం చేశారు.
ఉదయ్‌పూర్‌లో నవసంకల్ప్ చింతన్ శివిర్‌లో పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలపై తీర్మానాలు చేశారు. తీర్మానాల కోసం ఆరు కమిటీలను సైతం వేశారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
Also read:TS Rajyasabha: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు, కేసీఆర్ మదిలో ఉన్న ఆలోచనేంటి
Also read:PM Modi calls Bandi sanjay: బండి సంజయ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..ఎందుకంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook