Priyanka Gandhi slams BJP in UP Assembly Elections: దేశంలోని బడా పారిశ్రామిక వేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. సామాన్య ప్రజలకు సేవ చేయాలనే రాజధర్మాన్ని బీజేపీ ఎప్పుడో మరిచిపోయిందన్నారు. ఓట్ల కోసం మతం మరియు కులాన్ని ఉపయోగించుకునే రాయకీయ నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక కోరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంక తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయ్‌బరేలిలోని జగత్‌పూర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.... 'ఓట్ల కోసం మతం, కులం పేరును ఉపయోగించుకునే వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతు సమస్యలు వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొందరు మతపరమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఓట్లను అడుగుతారు. ప్రజలకు సేవ చేయాలనే మతాన్ని బీజేపీ నేతలు మరచిపోయారు. ఓట్లు దండుకునేందుకు ప్రజలను రెచ్చగొట్టేందుకు వారికి మతం ఒక సాధనంగా మారింది. ప్రజలకు సేవ చేయాలనే రాజ ధర్మాన్ని బీజేపీ ఎప్పుడో మరిచిపోయింది' అని విమర్శించారు. 


ప్రియాంక గాంధీ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతూ.. బీజేపీ హయాంలో గ్యాస్ సిలిండర్ మరియు మస్టర్డ్ ఆయిల్ ధరలు పెరిగాయన్నారు. ఓ రోజు కూలీ రూ. 200 సంపాదిస్తే.. ఆవాల నూనె బాటిల్ రూ. 240గా ఉందని విమర్శించారు. యువతలో నిరుద్యోగం, రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ప్రభుత్వం మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిందని ఆమె ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బును పట్టించుకోకుండా కేంద్రం అనవసర ఖర్చులు చేస్తోందని ప్రియాంక ఫైర్ అయ్యారు. 


'చెరకు రైతులకు రూ.14వేల కోట్ల బకాయిలు చెల్లించడానికి డబ్బుల్లేవు. కానీ విదేశీ పర్యటనల కోసం రూ.16 వేల కోట్లు విలువైన విమానాలను ప్రధాని మోదీ కొనుగోలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తే బీజేపీ బడా వ్యాపార వేత్త రుణాలను మాఫీ చేసింది. పాకిస్థాన్‌ సహా వివిధ దేశాల్లో గత కొన్నేళ్లలో ప్రధాని పర్యటించారు. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు మాత్రం వెళ్లలేదు. ఎన్నికల కోసం చట్టాలు రద్దు చేస్తున్నామంటూ ప్రకటించి ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పారు. రైతులు ప్రాణాలు కోల్పోయే వరకు చట్టాలను ఎందుకు రద్దు చేయలేదు' అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. 


Also Read: IND vs WI: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. పొట్టి సిరీస్ కూడా క్లీన్ స్వీప్! పాపం విండీస్ ఒక్క మ్యాచ్ గెలవదాయే!


Also Read: Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook