జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుంటుందా.. లేక బీజేపీ తమ పంతం నెగ్గించుకుంటుందా అని గత రెండు రోజుల పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. సోమవారం (జులై 13న) ఉదయం జైపూర్‌లోని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రణ్‌దీప్ సుర్జేవాలా (Randeep Surjewala) మీడియాతో మాట్లాడారు. SBI జాబ్స్‌కు అప్లై చేశారా.. నేడు ఆఖరు తేదీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఎన్‌ఐతో సుర్జేవాలా మాట్లాడుతూ... ‘రాష్ట్ర ప్రజలకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంది. ఐదేళ్లు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. ఇందులో ఏ సందేహం లేదు. కాంగ్రెస్‌ను చీల్చాలని ప్రయత్నించి బీజేపీ విఫలమైంది. పార్టీ కీలకనేత సచిన్ పైలట్ (Sachin Pilot)‌తో గత రెండు రోజుల్లో పలుమార్లు హైకమాండ్ మాట్లాడి, ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంది. కాంగ్రెస్ నేతలకు పోస్టుల విషయంలో, ఏదైనా పదవి విషయంలో సమస్యలు, అనుమానాలుంటే కచ్చితంగా పార్టీ ఫోరమ్‌లో అంశాన్ని లేవనెత్తాలని’ సూచించారు. బాలీవుడ్‌లో మరో విషాదం.. యువ నటి మృతి


కాంగ్రెస్ నేతలందరం కలిసికట్టుగా పనిచేసి మన సమస్యల్ని (Rajasthan Crisis) మనమే షరిష్కరించుకుందామన్నారు. కేవలం సచిన్ పైలట్‌కు మాత్రమే కాదు ఎవరికైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కచ్చితంగా పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనాలని సూచించారు. తద్వారా రాజస్థాన్‌లో స్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చాటిచెప్పాలని ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..