AAP on MP Elections: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆప్, కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆందోళన
AAP on MP Elections: ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పగ్గాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా విస్తరిస్తోంది. ఇటీవల జాతీయ పార్టీ హోదా దక్కించుకోవడంతో దూకుడు పెంచేసింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఆ వివరాలు మీ కోసం..
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతంతో జాతీయ పార్టీ హోదా సాధించింది. ఇప్పుడు త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆప్ తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రంలోని 230 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆప్ వెల్లడించింది. ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు నేరుగా ఫోన్ నెంబర్ కూడా ప్రకటించింది. ఎంపీలో అధికారంలో వస్తే..ఢిల్లీ, పంజాబ్ తరహాలో ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలు ఇస్తామని తెలిపింది.
ముందు ఢిల్లీ తరువాత పంజాబ్‌లో అధికారం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్ పై కన్నేసింది. 2023 చివర్లో ఎంపీ ఎన్నికలున్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల ఆప్ ఎజెండాలో కాంట్రాక్ట్ ఉద్యోగుల కన్ఫర్మేషన్ ప్రధానాంశంగా ఉంటుందని ఆప్ తెలిపింది. తమది ప్రజా ప్రభుత్వమని..ప్రజలే పాలకులని ఆప్ స్పష్టం చేసింది. ఈ నినాదంతోనే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారం సాధించామని పార్టీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటన కాంగ్రెస్ పార్టీకు టెన్షన్ పెంచుతోంది.
ఎందుకంటే..ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆప్ అడుగడుగునా అడ్డు తగిలింది. బీజేపీ 156 స్థానాలతో పెద్ద పార్టీగా నిలవగా గత ఎన్నికలతో పోలిస్తే 33 సీట్లు అదనంగా సాధించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 5 అసెంబ్లీ సీట్లే గెల్చుకున్నా..12.9 శాతం ఓట్లు దక్కించుకుంది. 35 స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది. గతంలో అంటే 2017లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కేవలం 16 సీట్లే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకు 2017లో ఆప్ పోటీలో లేనప్పుడు 43 శాతం ఓట్లు రాగా ఈసారి అంటే 2022లో 27 శాతమే వచ్చాయి. ఆప్ మాత్రం 13 శాతం ఓట్లు సాధించింది.
అంటే గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీనే చీల్చింది. ఇప్పుడు మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కూడా అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకు మరిన్ని కష్టాలు ఎదురుకావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook