Ban on Apps: వేధించే రుణ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం, 232 యాప్‌లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

Ban on Apps: ప్రత్యర్ధి దేశం చైనాకు ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది. దేశంలో నడుస్తున్న 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో లోన్ యాప్‌లు కూడా ఉండటం గమనార్హం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2023, 02:08 PM IST
  • బెట్టింగ్, వేధింపులకు గురి చేసే లోన్ యాప్‌లపై కేంద్రం ఉక్కుపాదం
  • చైనా దేశపు 232 యాప్‌లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
  • ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు కాగా, 94 లోన్ యాప్‌లు
Ban on Apps: వేధించే రుణ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం,  232 యాప్‌లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

డ్రాగన్ కంట్రీ చైనాకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి చైనా దేశపు యాప్‌లపై బ్యాన్ విధించింది. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లను ఒకేసారి నిషేధించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవలి కాలంలో లోన్ యాప్‌లతో వేధింపులు పెరగడం, ఆత్మహత్యలు చోటుచేసుకోవడం ఎక్కువైంది. ఇలాంటి యాప్‌లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గత కొద్దికాలంగా పెరుగుతోంది. ఈ తరహా యాప్‌లు వేధింపులకు గురి చేయడమే కాకుండా..గూఢచర్యానికి కూడా పాల్పడుతున్నట్టు సమాచారం. దాంతో కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఇచ్చిన సిఫారసుల మేరకు కేంద్ర ఐటీ శాఖ ఈ యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 232 యాప్‌లలో 138 బెట్టింగ్ యాప్‌లు కాగా, 94 రుణాల యాప్‌లు ఉన్నాయి. లోన్ యాప్‌లలో 94 ఇ స్టోర్‌లో అందుబాటులో ఉండగా..ఇంకొన్ని థర్డ్ పార్టీ లింక్ ల ద్వారా పనిచేస్తున్నాయి.

ఈ యాప్‌లు లోన్ తీసుకున్న వ్యక్తుల్ని అప్పుల్లో బంధించడమే కాకుండా గూఢచర్యం, ప్రచార సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా...దేశ పౌరుల డేటాకు ప్రమాదం కల్గించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Also read: PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News