దాదాపు 25 ఏళ్ల అనంతరం మరో దక్షిణాది వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. విశేషమేంటంటే..అధ్యక్ష పదవికి ఈసారి పోటీపడిన ఇద్దరూ దక్షిణాదివారే. రెండు రాష్ట్రాల్నించి ఇప్పటివరకూ ఒక్కొక్కరే అధ్యక్షులుగా పనిచేయడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 17న జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సుదీర్ఘకాలం తరువాత గాందీయేతర కుటుంబవ్యక్తి, దక్షిణాదికి చెందిన మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశి థరూర్ పై  6,822 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ నేపధ్యంలో 135 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆ పార్టీ అధ్యక్షులుగా సేవలందించిన దక్షిణాది వ్యక్తుల గురించి ఓసారి పరిశీలిద్దాం.


135 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో దక్షిణాది నుంచి ఇప్పటివరకూ 9 మంది అధ్యక్షులు కాగా..ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే పదవ వ్యక్తి. ఈ పదిమందిలో ఐదుగురు స్వాతంత్రం అనంతరం పార్టీ అధ్యక్షులుగా పనిచేయగా..మిగిలిన ఐదుమంది స్వాతంత్య్రానికి పూర్వం సేవలందించారు. నిజలింగప్ప తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రెండవ వ్యక్తి మల్లికార్జున ఖర్గే.


1890 నుంచి పార్టీ అధ్యక్షులుగా దక్షిణాది వ్యక్తులు


దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలివ్యక్తి పానపాక్కమ్ ఆనందాచార్యులు. మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతానికి చెందిన ఈ ఫ్రీడమ్ ఫైటర్ 1890లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత కేరళకు చెందిన న్యాయవాది సి శంకరన్ నాయర్ 1897లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉండటం ఇప్పటివరకూ ఇదే. శశిధరూర్ ఎన్నికై ఉంటే రెండవ వ్యక్తి అయ్యేవారు.


ఇక 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీకు చెందిన మరో న్యాయవాది, ఏవో హ్యూమ్‌కు అత్యంత సన్నిహితుడైన సి విజయ రాఘవచారియర్ ఎన్నికయ్యారు. తరువాత 1926లో ఇదే మద్రాస్ ప్రెసిడెన్సీకు చెందిన న్యాయవాది ఎస్ శ్రీనివాస్ అయ్యంగర్ ఎన్నికయ్యారు. 


ఇక దేశ స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడిగా 1948లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బి పట్టాభి సీతారామయ్య ఎన్నికయ్యారు. కాంగ్రెస్ త్రిసభ్య కమిటీలో ఈయన సభ్యుడు కూడా. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ద వల్లభాయ్ పటేల్ తో పాటు కీలకమైన సభ్యుడుగా ఉన్నారు. 


ఆ తరువాత ఏపీకు చెందిన మరో వ్యక్తి నీలం సంజీవరెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లిన వ్యక్తి. అనంతరం భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 


అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిగా కామరాజ్


ఆ తరువాత 1964లో కే కామరాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. మద్రాస్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. కాంగ్రెస్ లో ఎంత కీలకమైన వ్యక్తంటే..నెహ్రూ అనంతరం మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్ వంటి నేతల ప్రధానమంత్రి కలల్ని అడ్డుకుని...లాల్ బహదూర్ శాస్త్రిని నెహ్రూ వారసుడిగా ఎన్నికయ్యేలా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి తరువాత ఆ పదవికి ఇందిరా గాంధీని ముందు పెట్టింది కూడా ఈయనే.


ఆ తరువాత 1968లో కర్నాటకకు చెందిన ఎస్ నిజలింగప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలకముందు ఈయనే చివరి అధ్యక్షుడు. 


ఇక ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దక్షిణాది నుంచి ఎన్నికైన మరో ఏపీ వ్యక్తి మాజీ ప్రదాని పీవీ నరశింహారావు. ఆర్ధిక సంస్కరణల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి. ప్రధానిగా పీవీ హయాంలోనే దేశం ఆర్ధిక సంస్కరణలకు తెరతీసింది. బాబ్రీ మసీదు విధ్వంసం అనేది ప్రధానిగా పీవీ నరశింహారావు వైఫల్యం. అయినా మోస్ట్ పవర్ ఫుల్ ప్రధానిగా పేరుతెచ్చుకున్నారు. 


Also read: AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పగ్గాలు.. కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook