కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడైన అహ్మద్ పటేల్ కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన నెల రోజుల్నించి చికిత్స తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడైన అహ్మద్ పటేల్ ( 71 ) కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన నెల రోజుల్నించి చికిత్స తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేతను కోల్పోయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు గడించిన అహ్మద్ పటేల్ ( Ahmed patel demisal ) మరణించారు. నెల రోజుల క్రితం కరోనా ( Corona virus ) బారిన పడిన అహ్మద్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అతని కుమారు ఫైజల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన కరోనా బారిన పడినట్టు అహ్మద్ పటేల్ స్వయంగా వెల్లడించారు. అహ్మద్ పటేల్ మరణించడం పార్టీకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.
Also read: RTGS అంటే ఏంటి ? డిసెంబర్ నుంచి మారనున్న అంశాలేంటి ?