Kerala: విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
కేరళలో ( kerala ) పినరయి విజయన్ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు 24న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు కేరళ కాంగ్రెస్ పార్టీ ( Kerala congress party ) నేత రమేష్ చెన్నితల స్పష్టం చేశారు.

కేరళ అసెంబ్లీ ( kerala Assemble sessions ) సమావేశాలు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ( No confidence motion ) ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇటీవల జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో, కోవిడ్ 19 పేరిట జరిగిన అవినీతిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( kerala cm p vijayan ) పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సందిగా ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కోవిడ్ 19 రోగుల ఫోన్ కాల్స్ వివరాలు సేకరించకూడదంటూ ప్రతిపక్ష నేత రమేష్ కేరళ హైకోర్టులో వేసుకున్న పిటీషన్ తిరస్కరణకు గురైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తీసుకొస్తున్నారు రమేష్ చెన్నితల.
మరోవైపు కేరళ బంగారం స్మగ్లింగ్ ( kerala gold smugling case ) కేసులో దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. స్మగ్లింగ్ ముఠా హైదరాబాద్ నుంచి పలు దఫాలుగా బంగారం దిగుమతి చేసిందనే విషయంపై దర్యాప్తు సాగుతోంది. Also read: Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో