K Sankara Narayanan Passes Away: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.శంకర నారాయణన్ (89) కన్నుమూశారు. కేరళ పాలక్కడ్‌లోని తన స్వగృహంలో ఆదివారం (ఏప్రిల్ 24) తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఏడాదిన్నరగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శంకర్ నారాయణ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేరళ ప్రభుత్వంలో ఎక్సైజ్, ఆర్థిక, వ్యవసాయ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్, గోవా రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.


శంకర నారాయణన్ అంత్యక్రియలు సోమవారం (ఏప్రిల్ 25) సాయంత్రం 5.30గంటలకు జరగనున్నాయి. అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. శంకర నారాయణన్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు సంతాపం ప్రకటించారు. లౌకికవాదంతో, నెహ్రూ దృక్పథంతో శంకర నారాయణన్ పనిచేశారని... యూడీఎఫ్ కన్వీనర్‌గా సుదీర్ఘ కాలం కొనసాగారని విజయన్ గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయనెప్పుడూ సానుకూల దృక్పథంతో వ్యవహరించేవారని అన్నారు.


శంకర నారాయణ్ మృతి కేరళకు, దేశానికి తీరని లోటు అని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. శంకర్ నారాయణన్ పరిపాలనా అనుభవజ్ఞుడని.. సామాజిక నిబద్దత కలిగిన వ్యక్తిని అభిప్రాయపడ్డారు. 


Also Read: Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?  


Also Read: Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.