Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరన్న అంశం ఆసక్తిని కల్గిస్తోంది. దీనిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఆ పార్టీ నేతలు సైతం చెప్పలేని పరిస్థితి. ఈసమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తిగా అధ్యక్ష పదవికి దూరం కాలేదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సూచన ప్రాయంగా సమాధానం ఇచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు..తాను అధ్యక్షుడిగా ఉంటానా..ఉండనా అనే దానిపై క్లారిటీ వస్తుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తానేం చేయాలో తాను నిర్ణయించుకున్నానని..ఇందులో ఎలాంటి గందరగోళం అవసరం లేదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మళ్లీ ఆయననే పార్టీ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే గంతకొంతకాలంగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నారు. మళ్లీ ఆ పదవి చేపట్టేందుకు ఆమె నిరాకరించారు. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యింది.


2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పార్టీ పగ్గాలు తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఐతే తాను చేపట్టడం లేదంటూ చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌ బాధ్యతలు తీసుకోవాలని రాహుల్‌పై ఆ పార్టీ నేతలు సైతం ఒత్తిడి తెచ్చారు. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఎన్నిక నిర్వహించాలని సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.


పార్టీ అధ్యక్ష ఎన్నిక నవంబర్ 17న జరగనుంది. రెండు రోజుల తర్వాత ఫలితాలు రానున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర సాగుతుంది. ఈనేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంది.


Also read:Indian Railway Tickets: ట్రైన్‌లో టాయిలెట్ పక్కన బెర్త్ రాకుండా టికెట్ ఇలా బుక్ చేసుకోండి..!


Also read:Hair Loss Issues: చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతుందా..ఐతే ఇలా చేయండి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి