Indian Railway Tickets: రైల్వే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐతే సరైనా సీటు దొరకపోతే చిరాకు తెప్పిస్తుంది. టాయిలెట్ పక్కన సీటు ఉంటే అంతకంటే నరకం ఇంకొక్కటి ఉండదు. ఎప్పుడు దిగిపోదామా అనిపిస్తుంది. ఎందుకంటే వివిధ రకాల వ్యక్తులు మరుగుదొడ్లు ఉపయోగించడం వల్ల..ప్రవేశ ద్వారం ప్రతిసారి తెరవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. టాయిలెట్లు, ప్రవేశ ద్వారం దగ్గరల్లో మీకు ట్రైన్ సీటు రాకుండా ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఐఆర్సీటీసీ రైళ్లలో సీటింగ్ సరళి..
మన రైళ్ల డిజైన్లు వివిధ రకాలుగా ఉంటాయి. వాటి ఖర్చు, బెర్త్‌లు, సౌకర్యాలు మారుతుంటాయి. ఐతే ప్రతి కోచ్‌కు రెండు గేట్లు, మరుగుదొడ్లు ఉన్నాయి. సుదూరం వెళ్లే రైళ్లల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అవేంటో చూద్దాం..
AC 1వ తరగతి(1A)..
AC 1వ తరగతికి కేటాయించబడ్డ కోచ్ కోడ్ హెచ్‌గా ఉంది. కోచ్‌లో అప్పర్ వన్, లోయర్ వన్ అంటూ 24 బర్త్‌లు ఉంటాయి. వాటిని అవసమైతే మూసుకోవచ్చు...లాక్ చేసుకోవచ్చు. సైడ్ బెర్త్‌లకు బదులుగా ప్రత్యేక నడక మార్గం ఉంటుంది. ఇది ప్రధాన ద్వారంతో ముడిపడి ఉంటుంది.
2 టైర్ ఏసీ స్లీపర్(2A)
2 టైర్ ఏసీ స్లీపర్ క్లాస్‌కు కేటాయించబడ్డ కోచ్‌ను కోడ్ ఏగా పిలుస్తారు. కోచ్ పరిమాణాన్ని బట్టి 46 నుంచి 54 బెర్త్‌లు ఉంటాయి. రెండు అంచెలుగా లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉంటాయి.
3 టైర్ ఏసీ స్లీపర్(3A)
3 టైర్ ఏసీ స్లీపర్ క్లాస్‌ను కోడ్ బీగా అంటారు. ఒక్కో కోచ్‌లో 64 బెర్త్‌లు ఉంటాయి. సైడ్ బెర్త్‌లు రెండు అంచెలుగా ఉంటాయి. మరోవైపు అప్పర్, మిడిల్, లోయర్ బెర్త్‌లతో మూడు రకాలు బెర్త్‌లు ఉంటాయి.
స్లీపర్ క్లాస్(SL)
స్లీపర్ క్లాస్‌ను కోడ్ ఎస్‌గా ఉంది. ఇది నాన్ ఏసీ కోచ్. కోచ్‌లో 72 మంది కూర్చునేందుకు, స్లీపింగ్ చేసేందుకు వీలు ఉంది. ఇందులో ఏసీ ఉండదు. కానీ 3 టైర్, ఏసీ స్లీపర్ క్లాస్ లాగే సిటింగ్ ఉంటుంది. గాలిని లోపలికి వచ్చేందుకు విండోలు తెరుకోవచ్చు. ఇందులో టాయిలెట్ల దగ్గర సీటు దొరికితే అంతే. ఎందుకంటే వారికి ప్రత్యేక డోర్ ఉండదు. టాయిలెట్ల ద్వారం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది.
రెండో సిటింగ్(2S)
ఇది నాన్ ఏసీ కోచ్..ఇందులో కూర్చుకోవడానికే వీలు ఉంటుంది. 108 సీట్లు ఉంటాయి. ఎలాంటి బెర్త్‌లు ఇందులో ఉండవు.
ఏసీ ఛైర్ కార్
ఇది ఏసీ కోచ్, దీనిని కోడ్ భాషలో సీ లేదా డీగా అంటారు. కోచ్‌లో 67 నుంచి 75 మంది కూర్చోవచ్చు. నడక మార్గానికి ఇరువైపులా 23 సీట్లు వరుసగా ఉంటాయి.
గరీబ్ రథ్(3A)
గరీబ్ రథ్ రైలులో ఏసీ ఉంటుంది. కోచ్‌ను కోడ్ జీగా పిలుస్తారు. ప్రతి కోచ్‌లో 81 బెర్త్‌లు ఉంటాయి. సైడ్ బెర్త్‌లతో సహా కేవలం 3 టైర్ల వసతి ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఇలా చేసుకోవచ్చు..
మరుగుదొడ్ల దగ్గర సీటు రావాలని ఎవరూ కోరుకోరు. ఐతే కొంతమంది తెలియక సీట్లను ఎంపిక చేసుకుంటుంటారు. దీనిపై పక్కగా సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. సీట్ల ఎంపికపై ఐఆర్‌టీసీ ఓ లెక్కను అనుసరిస్తోంది.
సీట్ల కేటాయింపులో ఐఆర్‌సీటీసీ లెక్కలు..
కోచ్‌ల మధ్యలో ఉన్న సీట్లను మొదట కేటాయిస్తారు. ఇది బోగీల్లో లోడ్‌ను సమానంగా పంపిణీ చేస్తుంది. రైలులో సరైన బ్యాలెన్స్‌ను పంపిణీ చేస్తుంది. మధ్య సీట్లను నింపిన తర్వాత కోచ్ యొక్క చివరి సీట్లను కేటాయిస్తారు.
మరుగుదొడ్ల వద్ద రైలు సీటు రాకుండా చిట్కాలు..
మరుగుదొడ్ల వద్ద రైలు సీటు రాకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా టికెట్‌ను బుక్ చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ..ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వే ప్రాతిపదికన సీట్లను పంపిణీ చేస్తుంది. మీరు ముందే బుక్ చేసుకుంటే కోచ్ మధ్యలో సీటు దొరికే అవకాశం ఉంది. సీట్లను కేటాయించేటప్పుడు ప్రాధ్యానత ఎంచుకోవాలని ఐఆర్సీటీసీ అడుగుతుంది. దానిని నింపకపోవడం వల్ల కోచ్ చివర్లో సీట్లు దక్కే అవకాశం ఉండదు. మీకు అదృష్టం ఉంటే ఆలస్యం బుక్ చేసుకున్నా..మధ్యలో సీటు దొరుకుతుంది.
Also read:విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే... నేను ఖాళీగా కూర్చోవాలా! కేఎల్ రాహుల్ ఫైర్
Also read:Match Fixed: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి