భారత్‌లో మళ్లీ రామ రాజ్యం: Baba Ramdev
ఎట్టకేలకు రామ మందిరం (Ram Temple in Ayodhya) దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యలో ఎట్టకేలకు రామ మందిరం (Ram Temple in Ayodhya) దిశగా అడుగులు పడుతున్నాయి. నేడు ప్రధాన నరేంద్ర మోదీ రామాలయానికి భూమి పూజ (Ram Temple Bhoomi Puja), శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) అయోధ్యకు చేరుకున్నారు. స్థానిక హనుమాన్ గఢీలోని ఆలయంలో స్వామివారిని దర్శించి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో నేడు ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..
హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రామ మందిరం భూమి, నిర్మాణంపై ఏఎన్ఐతో మాట్లాడారు. ‘భారతదేశంలో ఇది చారిత్రాత్మక రోజు. చరిత్రలో ఈరోజు ఎప్పటికీ నిలిచిపోతుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని నేను ఎప్పటినుంచో ధీమాగా ఉన్నాను. రామాలయం నిర్మాణంతో భారత్‌లో రామ రాజ్యం వస్తుందని భావిస్తున్నానంటూ’ రాందేవ్ బాబా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Ram Temple: టైమ్ క్యాప్సుల్ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?
చారిత్రక ఘట్టానికి ముందురోజు Hanuman Chalisa పఠించిన కమల్‌నాథ్