Corona in India: దేశంలో కరోనా ఉగ్రరూపం- వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్ర రూపం (Corona cases in India) చూపిస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో తాజాగా 40,925 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 20 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 14,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Corona in India: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్ర రూపం (Corona cases in India) చూపిస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో తాజాగా 40,925 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 20 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 14,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 1,41,492 యాక్టివ్ కరోనా (Active Corona cases in Maharashtra) కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో కేసుల సంఖ్య (Omicron cases in Maharashtra) 876 వద్ద స్థిరంగా ఉంది. రికవరీలు మాత్రం 435కు పెరిగాయి.
ముంబయిలో కొవిడ్ కల్లోలం..
ముంబయిలో శుక్రవారం ఒక్క రోజే 20,971 కరోనా కేసులు (Corona cases in Mumbai) నమోదయ్యాయి. మరో 6 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. ముంబయిలో రికవరీ రేటు 87 శాతంగా ఉంది.
డిసెంబర్ 31 నుంచి జనవరి 6 వరకు నగరంలో కొవిడ్ కేసుల వృద్ధి 1.23 శాతంగా ఉంది. ప్రస్తుతం ముంబయిలో యాక్టివ్ కరోనా కేసులు (Active Corona cases in Mumbai) 91,731 వద్ద ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
ఢిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. శుక్రకవారం ఒక్క రోజే ఇక్క 17,335 మందికి (Corona cases in Delhi) పాజిటివ్‌గా తేలింది. 9 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39,873గా ఉంది.
పశ్చిమ్ బెంగాల్లో కొవిడ్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. 18,213 కరోనా కేసులు (Corona cases in West Bengal) బయటపడ్డాయి. 18 మంది కొవిడ్‌కు బలయ్యారు.
తమిళనాడులో కొత్తగా 8,981 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona cases in Tamil Nadu) తేలింది. 984 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 8 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు (Corona Active cases in Tamil Nadu) 30,817 వద్ద ఉన్నాయి.
కర్ణాటకలో 8,449 కొవిడ్ కేసులు (Corona cases in Karnataka) నమోదవగా.. గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు.
కేరళలో కొత్తగా 5,296 కొవిడ్ కేసులు (Corona cases in Kerala) నమోదయ్యాయి. 35 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27,859 యాక్టివ్ కరోనా కేసులు (Corna active cases in Kerala) ఉన్నాయి.
గోవాలో కూడా కరోనా ఉదృతి పెరిగింది. తాజాగా ఇక్కడ 1,432 కేసులు (Corona cases in Goa) నమోదయ్యాయి. 112 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మహమ్మారికి బలయ్యారు. గోవా వ్యాప్తంగా మొత్తం 5,931 యాక్టివ్ కేసులు (Corna active cases in Goa) ఉన్నాయి.
పంజాబ్‌లో తాజాగా 2,901 కరోనా కేసులు (Corona cases in Punjab) నమోదవగా.. ఒకరు మృతి చెందారు. 135 మంది కొవిడ్‌ను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,425 యాక్టివ్ కొవిడ్ కేసులు (Corona active cases in Punjab) ఉన్నాయి.
హరియాణాలో ఒక్క రోజులోనే 3,748 కరోనా కేసులు (Corna cases in Haryana) నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 8.11 శాతానికి పెరిగింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 123కు (Omicorn cases in Haryana) చేరింది.
Also read: Paracetamol not recommended : వ్యాక్సినేషన్ తర్వాత ఆ ట్యాబ్లెట్ అస్సలు వాడొద్దు..
Also read: New Rules: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు! క్వారంటైన్ తప్పనిసరి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook