Precaution dose: 18 ఏళ్ల దాటిన వారికి ప్రికాషన్ డోసు నేటి నుంచే.. ఈ విషయాలు తెలుసుకోండి
Precaution dose: దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వడం ప్రారంభించాయి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు. మరి ఎవరెవరు? ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు? మూడో డోసు ధర ఎంత? అనే పూర్తి వివరాలు మీకోసం.
Precaution dose: కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నుంచి మరింత రక్షణ కోసం.. ప్రికాషన్ డోసు (బూస్టర్ డోసు) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా అనుమతినిచ్చింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ఈ డోసు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 నుంచే ప్రైవేటు కేంద్రాల్లో ఇప్పటికే టీకా ప్రక్రియ ప్రారంభమైంది. మరి మీరు బూస్టర్ డోసు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అంతకన్నా ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
ప్రికాషన్ డోసు గురించి కీలక విషయాలు..
కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం ప్రకారం.. నేటి నుంచి (ఏప్రిల్ 10) ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రికాషన్ డోసు వేస్తారు. అయితే మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వత 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
రెండు డోసుల టీకా ఉచితంగా తీసుకున్నా.. ప్రికాషన్ డోసుకు మాత్రం డబ్బులు చెల్లించాలి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన టీకాలు సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాల ధరలను తగ్గించాయి. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఒక డోసు ధరను రూ.225గా నిర్ణయించాయి ఆ కంపెనీలు.
ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం.. 1963 నుంచి 2004 మధ్య జన్మించిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు. అయితే రెండో డోసు తీసుకున్న 273 రోజులు తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాలి.
ప్రికాషన్ డోసు తీసుకోవాలనుకునే వారు మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలు వెళ్లి కొవిన్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యి.. రిజిస్ట్రేషన్ ఐడీని చూపిస్తే సరిపోతుంది.
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 15 ఏళ్లు దాటిన 96 శాతం జనాభా కనీసం ఒక డోసు కరోనా టీకా తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న జనాబా 83 శాతం మంది.
ఇప్పటి వరకు దేశంలో 2.4 కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇందులో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. డిమాండ్‌కు తగ్గట్లు టీకాల పంపిణీకి సిద్ధమని చెబుతున్నాయి ప్రైవేటు టీకా కేంద్రాలు.
18 ఏళ్లు దాటిన వారందరు డబ్బులు చెల్లించి ప్రికాషన్ డోసు తీసుకోవాలని చెప్పినప్పటికీ.. ఫ్రంట్‌లైన్ హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు మాత్రం ఉచితంగానే మూడో డోసు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రైవేటులో టీకా తీసుకుంటే రూ.225తో పాటు.. సర్వీస్ ఛార్జ్ కింద తీసుకునే మొత్తంపై కూడా ప్రభుత్వం పరిమితులు విధించింది. రూ.150 కన్నా ఎక్కువగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయొద్దని వ్యాక్సిన్ కేంద్రాలకు సూచించింది.
ప్రికాషన్ డోసు తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో దానినే ప్రికాషన్ డోసుగా తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: IMD Twitter Hack: షాకింగ్... భారత వాతావరణ శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్..
Also read: Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook