Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...

Bridge Stolen in Bihar:  వాళ్లంతా ఓ దొంగల ముఠా... కానీ గెటప్ పూర్తిగా మార్చేశారు... ఆఫీసర్ల అవతారమెత్తి ఆ ఊర్లో వాలిపోయారు. ఇరిగేషన్ అధికారులమని చెప్పి హడావుడి చేశారు. చివరకు...

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 06:39 PM IST
  • బీహార్‌లో ఇరిగేషన్ అధికారులకు షాకిచ్చిన దొంగల ముఠా
  • అధికారుల్లా దర్జా ఒలకబోస్తూ వచ్చిన దొంగలు
  • దొంగల ముఠా అని తెలియక సహకరించిన అధికారులు
Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...

Bridge Stolen in Bihar: వాళ్లంతా ఓ దొంగల ముఠా... కానీ గెటప్ పూర్తిగా మార్చేశారు... ఆఫీసర్ల అవతారమెత్తి ఆ ఊర్లో వాలిపోయారు. ఇరిగేషన్ అధికారులమని చెప్పి హడావుడి చేశారు. చివరకు ఓ బ్రిడ్జి వద్దకు వెళ్లి నిరుపయోగంగా ఉన్న ఆ బ్రిడ్జిని తొలగించాలని అన్నారు. వాళ్లే పూనుకుని గ్యాస్ కట్టర్లు, మెషీన్స్‌తో ఎట్టకేలకు దాన్ని తొలగించారు. ఇందుకు స్థానిక ఇరిగేషన్ అధికారులు సైతం వారికి సహకరించారు. పని కానిచ్చేశాక ఆ దొంగల ముఠా ఎంచక్కా ఆ స్క్రాప్‌తో అక్కడినుంచి జంప్ అయిపోయింది. వచ్చింది ఆఫీసర్లు కాదని దొంగల ముఠా అని తెలియడంతో షాక్ తినడం స్థానిక ఇరిగేషన్ అధికారుల వంతైంది. బీహార్‌లోని రోహ్తస్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రోహ్తస్ జిల్లాలోని అమియావర్ గ్రామంలో ఉన్న అరాహ్ కెనాల్‌పై 1972లో బ్రిడ్జిని నిర్మించారు. ఇటీవలి కాలంలో ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించగా అది నిరుపయోగంగా మారింది. ఈ క్రమంలో ఓ దొంగల ముఠా కన్ను దానిపై పడింది. ఎలాగైనా ఆ బ్రిడ్జి ఐరన్ మెటీరియల్‌ను కాజేయాలనుకున్నారు. ఇందుకోసం ఇరిగేషన్ అధికారుల అవతారమెత్తి ఆ గ్రామంలో వాలిపోయారు.

తాము ఇరిగేషన్ అధికారులమని.. నిరుపయోగంగా ఉన్న ఆ బ్రిడ్జిని తొలగించడానికి వచ్చామని స్థానికులతో చెప్పారు. గ్రామస్తులతో పాటు స్థానిక ఇరిగేషన్ అధికారులు కూడా వారు నిజంగానే పై అధికారులని నమ్మారు. అంతేకాదు, ఆ బ్రిడ్జిని తొలగించడంలో వారికి సహకరించారు. అలా 3 రోజుల్లో జేసీబీలు, గ్యాస్ కట్టర్స్, ఇతరత్రా మెషీన్స్ ఉపయోగించి మొత్తానికి ఆ బ్రిడ్జిని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఊడబీకారు. అనంతరం ఆ స్క్రాప్ మెటీరియల్‌తో ఎంచక్కా అక్కడి నుంచి జంప్ అయిపోయారు.

ఆ తర్వాత గానీ స్థానిక ఇరిగేషన్ అధికారులు.. వచ్చింది దొంగల ముఠా అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. నిజం తెలిశాక స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ దొంగల ముఠాపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బ్రిడ్జి 60 ఫీట్ల పొడవు.. 12 ఫీట్ల ఎత్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే స్క్రాప్ డీలర్స్‌ను అలర్ట్ చేశామని... ఎవరైనా బ్రిడ్జి మెటీరియల్‌తో వస్తే వారి సమాచారం అందజేయాల్సిందిగా కోరామని అన్నారు.

Also Read: Precaution Dose: ప్రికాషన్ డోస్ సర్వీస్ చార్జీ ఎంతంటే... అంతకుమించొద్దని కేంద్రం ఆదేశాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News