Children Vaccination: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో ముందడుగు పడింది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతినివ్వగా.. రేపటి నుంచి (మార్చి 16) టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు వైద్య సిబ్బంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆ ఒక్క టీకానే..


ప్రస్తుతం 12-14 ఏళ్ల వారికి ఒకే ఒక్క వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అదే హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్​ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్​. ప్రస్తుతానికి దీనిని మాత్రమే చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి ఉంది.


రిజిస్ట్రేషన్ ప్రక్రియ​ ఇలా


  • సాధారణంగా అందరికీ రిజిస్ట్రేషన్ చేసినట్లుగానే.. పిల్లకు కూడా కొవిన్​ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.

  • ముందుగా కొవిడ్ యాప్​ లేదా పోర్టల్​లోకి వెళ్లి ఫోన్ నంబర్ ఎంటర్​ చేయాలి. పిల్లలు కాబట్టి.. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి నంబర్​ను వినియోగించుకోవచ్చు.

  • ఒకే నంబర్​పై నలుగురికి రిజిస్ట్రేషన్​ చేసే వీలుంది. కాబట్టి ఇప్పటికే ఒకే నంబర్​పై భార్యా, భర్తలు టీకా రిజిస్ట్రేషన్​ చేసుకున్నా.. అదే నంబర్​ను మరో ఇద్దరికి వినియోగించే వీలుంది.

  • ముందుగా మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ధృవీకరిస్తే.. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

  • పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్​ నంబర్​ వంటి వివరాలను ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్​ పూర్తి చేయొచ్చు.

  • ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియని వారు నేరుగా.. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కూడా రిజిస్ట్రేషన్​ చేసుకునే వీలుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అనుకూలమైన సమయంలో స్లాట్​ బుక్ చేసుకుని టీకా తీసుకునే వీలుంది.


Also read: PLI scheme: పీఎల్‌ఐ పథకానికి అనూహ్య స్పందన.. ప్రభుత్వ అంచనాలను మించిన దరఖాస్తులు


Also read: Hijab Dispute: ఇస్లాంలో హిజాబ్ ధారణ తప్పనిసరి కాదంటున్న హైకోర్టు, సుప్రీంను ఆశ్రయించే యోచనలో విద్యార్ధులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook