Vaccine shortage: దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్క రోజులో కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 2.5 లక్షలకు చేరువగా (Corona cases in India) నమోదైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా (Maharashtra Corona Cases) ఉంది. రోజుకు 40 వేలపైనే కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం చేసి.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రభుత్వం ప్రణాళికలకు పెద్ద సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సిన్​ల కొరత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపే కూడా గురువారం అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ల కొరత (Vaccine shortage in Maharashtra)  ఉన్నట్లు తెలిపారు.


కొరతకు కారణాలు..


ఈ నెల 3 నుంచి 15-18 ఏళ్ల వయసు పిల్లలకు (Children Vaccine) వ్యాక్సినేషన్​తో పాటు, 10వ తేదీ నుంచి అర్హులైన వృద్ధులకు ప్రికాషన్​ డోసు టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతి మంజూరు (Booster Dose) చేసింది. ఈ కారణంగానే తాము వ్యాక్సినేషన్​ కొరత సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు మంత్రి రాజేశ్​ తోపే.


ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 50  లక్షల కొవిషీల్డ్ డోసులు, 40 లక్షల కొవాగ్జిన్ డోసులు అదనంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.


మహారాష్ట్రలో కొవిడ్​ పరిస్థుతులు ఇలా..


మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు 21.4 శాతంగా (Corona in MH) ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పాజిటివిటీ రేటు 27 శాతానికి పెరిగింది. కేసులు భారీగా పెరుగుతున్నా.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణలు అంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల నమోదైన కేసుల్లో 2.8 శాతం మందే ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. మిగతావారంతా ఇళ్లల్లోనే ఐసోలేషన్​లో ఉంటున్నట్లు చెబుతున్నారు.


దేశవ్యాప్తంగా తాజాగా.. 2,47,417 కరోనా కేసులు (India Corona cases) నమోదయ్యాయి. మహారాష్ట్రలో బుధవారం 46,723 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 27,561 కొవిడ్ (Delhi Corona cases) కేసులు బయటపడ్డాయి.


Also read: Governor Prof. Jagdish Mukhi: అసోం, నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్ ప్రోఫెసర్ జగదీష్ ముఖికి కరోనా


Also read: UP Assembly Polls: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లికి చోటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook