UP Assembly Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. 125 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి పూనం పాండేకి చోటు దక్కడం విశేషం. తొలి జాబితాలో మొత్తం 50 మంది మహిళలకు అవకాశం కల్పించారు. అన్యాయం జరిగినవారికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందనేందుకు తాజా జాబితానే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
In the first list of 125 candidates for UP polls, 50 candidates are women, including Asha Singh, mother of the Unnao rape victim. From Shahjahanpur, we have fielded Asha worker Poonam Pandey who led an agitation for a raise in honorarium: Congress leader Priyanka Gandhi Vadra pic.twitter.com/x9WrFsqzvb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 13, 2022
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి మహిళా ఓటు బ్యాంకును టార్గెట్ చేసింది. 'అమ్మాయిని నేను.. నేను పోరాడగలను..' అనే నినాదంతో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 40 శాతం సీట్లను మహిళలకే ఇస్తామని హామీ ఇచ్చారు. మిగతా పార్టీలన్నీ కుల సమీకరణాలపై ఫోకస్ చేయగా.. కాంగ్రెస్ అందుకు భిన్నంగా మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుంది.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రత్యేక హామీలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్లు, 12వ తరగతి చదివే ప్రతీ విద్యార్థినికి స్మార్ట్‌ఫోన్, డిగ్రీ చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది. ఆత్మగౌరవం, స్వావలంబన, విద్య, సురక్ష, ఆరోగ్యం.. వీటి ప్రాతిపదికన మహిళా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతామని పేర్కొంది. గతంలో హత్రాస్ వంటి ఘటనలపై ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున పోరాడిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు మహిళా ఓటర్లు దగ్గరవుతారని ఆ పార్టీ భావిస్తోంది.
కాగా, ఉత్తరప్రదేశ్ సహా ఐధు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (UP Assembly Polls 2022) ఇటీవలే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. యూపీలో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదటి విడత, ఫిబ్రవరి 14న రెండో విడత, ఫిబ్రవరి 20న మూడో విడత, ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read: Virat Kohli Test Catches: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. వంద క్యాచులు అందుకున్న ఘనత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి