Governor Prof. Jagdish Mukhi: అసోం, నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్ ప్రోఫెసర్ జగదీష్ ముఖికి కరోనా

Jagdish Mukhi: అసోం, నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్ ప్రోఫెసర్ జగదీష్ ముఖి కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 01:43 PM IST
  • గవర్నర్ ప్రోఫెసర్ జగదీష్ ముఖికి కరోనా
  • స్వల్ప లక్షణాలలో ఆస్పత్రిలో చేరిక
  • కోలుకోవాలని అసోం సీఎం ట్వీట్
Governor Prof. Jagdish Mukhi: అసోం, నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్ ప్రోఫెసర్ జగదీష్ ముఖికి కరోనా

Governor Prof. Jagdish Mukhi tests positive for COVID-19: అసోం, నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్ ప్రోఫెసర్ జగదీష్ ముఖి కరోనా (Covid-19) బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆయన గౌహతిలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. జగదీష్ ముఖి (Prof. Jagdish Mukhi ) సతీమణికి కరోనా నెగెటివ్ గా తేలింది. ఆమె గౌహతిలోని రాజ్ భవన్ లో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు అసోం సీఎం హిమంత బిస్వాశర్మ ట్వీట్ చేశారు. గవర్నర్ కు మెరుగైన వైద్యం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అసోంలో బుధవారం 3,274 కరోనా కేసులు వెలుగుచూశాయి.

దేశంలో కరోనా విజృంభిస్తోంది. అన్ని రంగాలపై తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ((Nitin Gadkari), బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్​ (Amarinder Singh), కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సహా పలువురికి కొవిడ్ పాజిటివ్​గా నిర్దారణ అయింది. 

Also Read: Mallikarjun Kharge: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు కొవిడ్ పాజిటివ్‌

దేశంలో నిన్న రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు (Corona cases in India) నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో అయితే కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. సుప్రీంకోర్డు, పార్లమెంట్, పోలీసు శాఖలో భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో కరోనా టీకా పంపిణీ శరవేగంగా జరుగుతోంది. అయినా సరే కొవిడ్ ఉద్ధృతి ఆగడం లేదు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News