న్యూఢిల్లీ :  భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు ( India COVID19 cases ) కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. కేవలం శుక్రవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ (COVID)  కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరగడం కొంచెం ఉపశమనం కలిగిస్తోంది. Also read: NEET, JEE EXAMS 2020: జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబర్ వరకు వాయిదా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో దాదాపు 23వేల కేసులు వెలుగులోకి..
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,771 కొత్త కరోనావైరస్ (Coronavirus) కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. తాజా కేసులతో కరోనా రోగుల సంఖ్య 6,48,315 కు పెరిగింది. నిన్న ఒక్కరోజే ఈ మహమ్మారి కారణంగా 442 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 18,655 మరణాలు సంభవించాయి.  ఇంకా 2 లక్షల 35 వేల 433మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 3,94,227 మంది ఈ వ్యాధి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Also read: 
COVID-19 hospital: ఆచూకీ దొరికింది.. కానీ ప్రాణమే లేదు..


వరుసగా ఏడోరోజు 18వేలకు పైగా...
వరుసగా ఏడోరోజు 18,000పైగా  COVID-19 కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం ఒక్క‌రోజే దాదాపు 14వేల మంది కోలుకున్నారు. అయితే ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతం దాట‌డం కొంచెం ఊర‌ట కలిగిస్తోంది. 
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..