India Covid-19 Cases: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలు, 60వేలు చొప్పున కొవిడ్-19 కేసులు, వేయికి చేరువలో మరణాల సంఖ్య నమోదవుతోంది. గత 24 గంటల్లో సోమవారం కొత్తగా 55,079 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 876 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,02,743కు చేరుకోగా.. మరణాల సంఖ్య 51,797కు పెరిగింది. Also read: Telangana: తాజాగా 1,682 మందికి కరోనా


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,73,166 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 19,77,780 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.5శాతం ఉండగా.. మరణాల రేటు 1.9శాతంగా ఉంది. ఇదిలాఉంటే..  సోమవారం 8,99,864 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) తెలిపింది. ఆగస్టు 17 వరకు దేశవ్యాప్తంగా  3,09,41,264 కరోనా నమూనాలను  పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Kiran Mazumdar Shaw: కరోనా బారిన బయోకాన్ చీఫ్