Kiran Mazumdar Shaw: కరోనా బారిన బయోకాన్ చీఫ్

దేశంలో చాలామంది ప్రముఖులు కరోనావైరస్ ( coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మకంపెనీ.. బయోకాన్ (Biocon )  ఛైర్‌పర్సన్ సైతం కరోనా బారిన పడ్డారు. 

Last Updated : Aug 18, 2020, 08:23 AM IST
Kiran Mazumdar Shaw: కరోనా బారిన బయోకాన్ చీఫ్

Kiran Mazumdar Shaw tested Covid-19 : దేశంలో చాలామంది ప్రముఖులు కరోనావైరస్ ( coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మకంపెనీ.. బయోకాన్ ( Biocon )  ఛైర్‌పర్సన్ సైతం కరోనా బారిన పడ్డారు.  బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ( Kiran Mazumdar Shaw ).. తనకు కరోనా సోకినట్లు స్వయంగా సోమవారం రాత్రి ట్విట్ చేసి తెలిపారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని, తనకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానంటూ ఆమె ట్విట్ చేశారు. 

దేశంలోని ప్రముఖ మహిళల్లో 67 ఏళ్ల కిరణ్ మజుందార్ షా ఒకరు. ఈ మధ్య షా రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌‌పై పలు ప్రశ్నలు సంధించారు. అసలు క్లినికల్ ట్రయల్స్ ఎలా జరిగాయో రష్యా ఎందుకు చెప్పడం లేదని ఆమె నిలదీశారు. బెంగళూరులో కేవలం రూ.10 వేలతో ఫార్మా కంపెనీ ప్రారంభించి వేలాది కోట్ల సంస్థగా మలిచి మజుందార్ షా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. Also read: Gold Rate: తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

ఇదిలాఉంటే.. కిరణ్ మజుందార్ షా కోవిడ్ బారిన పడినట్లు ట్విట్ చేయగానే.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (Soumya Swaminathan), కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ ( Shashi Tharoor ), తదితర ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ చేశారు.Prabhas: ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

Trending News