India Covid-19 Cases updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. నిరంతరం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ( గురువారం ) కొత్తగా 68,898 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 983 మంది మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,05,823కు చేరుకోగా.. మరణాల సంఖ్య 54,849కు పెరిగింది.  Also read: Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,92,028 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 21,58,947 మంది బాధితులు ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే..  గురువారం 8,05,985 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) తెలిపింది. ఆగ‌స్టు 20 నాటికి దేశ‌వ్యాప్తంగా 3,34,67,237 న‌మూనాల‌ను ప‌రీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.Chittoor Gas Leak: చిత్తూరు గ్యాస్ లీకేజీ కలకలం