India Covid-19 updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. మూడురోజుల నుంచి 75వేలకు పైగానే రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో శుక్రవారం( ఆగస్టు 28న ) దేశవ్యాప్తంగా కొత్తగా  76,472 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,021 మంది మరణించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) శనివారం ఉదయం తెలిపింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,63,973కు పెరగగా.. ఇప్పటివరకు 62,550 మంది ఈ వైరస్‌తో చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,52,424 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 26,48,999 మంది బాధితులు కోలుకున్నారు. Also read: V Movie: వస్తున్నా వచ్చేస్తున్నా.. సాంగ్ రిలీజ్


ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 9,28,761 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో ఆగస్టు 28 వరకు పరీక్షించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4కోట్ల 4,06,609కు చేరిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 76.28శాతం ఉండగా.. మరణాల రేటు 1.82 శాతం ఉంది. Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు