Covid-19 cases in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనాకేసుల ( Coronavirus ) సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా ప్రతీరోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 45వేలు దాటింది. కొన్నిరోజుల నుంచి 60వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. నిన్న తగ్గాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 53,601 కరోనా కేసులు నమోదు కాగా.. 871 మంది ఈ మహమ్మారితో మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ( health ministry ) మంగళవారం తెలిపింది. తాజాగా నమోదయిన కేసులతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,68,675కు పెరిగింది. దీంతోపాటు మొత్తం మరణాల సంఖ్య 45,257కి పెరిగింది. Also read: Chidambaram: హిందీ నేర్చుకున్నవారు.. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోరు?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో 6,39,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 15,83,490 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 69.80 శాతానికి ఉండగా.. మరణాల రేటు 1.99శాతంగా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Brain Surgery: వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్