Chidambaram reacts to Kanimozhi issue: న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ కనిమొళి ( DMK MP Kanimozhi ) కి ఎదురైన చేదుఅనుభవం.. తనకు కూడా ఎన్నోసార్లు ఎదురైందని, ఇది అసాధరణ విషయం కాదని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ( P. Chidambaram) పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి సాధారణ పౌరుల వరకు హిందీలో మాట్లాడమంటూ ఒత్తిడి చేసేవారని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి హిందీ, ఇంగ్లీష్ భాషలు అధికారిక భాషలనే భావన నిజంగా ఉంటే.. హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కచ్చితంగా నేర్చుకునేలా ఉద్యోగులకు ఒత్తిడి చేయాలని ఆయన ట్విట్ చేశారు. Also read: Kanimozhi: నీకు హిందీ రాదా? నువ్వు భారతీయురాలివేనా?
I have experienced similar taunts from government officers and ordinary citizens who insisted that I speak in Hindi during telephone conversations and sometimes face to face
— P. Chidambaram (@PChidambaram_IN) August 10, 2020
చెన్నై విమానాశ్రయంలో ఎంపీ కనిమొళి తనకు హిందీ తెలియదని.. కావున తమిళం లేదా ఆంగ్లంలో మాట్లాడమని ఆదివారం ఒక మహిళా సీఐఎస్ఎఫ్ అధికారిని కోరారు. అప్పుడు ఆ అధికారి నీకు హిందీ రాదా.. నువ్వు భారతీయురాలివేనా (Kanimozhi's Nationality) అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ విషయాన్ని కనిమొళి.. హిందీ తెలిస్తేనే భారతీయులమనే భావన ఎప్పడు వచ్చిందంటూ ట్వీట్ చేసి ఖండించగా.. సీఐఎస్ఎఫ్ (CISF) విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్విట్టర్ ద్వార స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులు హిందీ త్వరగా..నేర్చుకుంటున్నప్పుడు, ఆంగ్లభాషను అంతే వేగంగా ఎందుకు నేర్చుకోలేరని ప్రశ్నించారు. Also read: Brain Surgery: వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్