Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు
Corona Cases Latest Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. బుధవారం 2,151 కేసులు నమోదవ్వగా.. నేడు కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 3,016 మందికి కోవిడ్ వైరస్ సోకింది. పూర్తి వివరాలు ఇలా..
Corona Cases Latest Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం మరోసారి పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో 3,016 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో యాక్టివ్ కేసుల 13,509కి చేరింది. రోజువారీ పాజిటివ్ రేట్ 2.73 శాతం ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 98.78 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,396 మంది కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 4,41,68,321 మంది కరోనాను జయించారు.
గత 24 గంటల్లో 1,10,522 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 92.14 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 15,784 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అలర్ట్ చేస్తోంది. బుధవారం 2,151 కేసులు నమోదవ్వగా.. ఈ రోజు కేసుల సంఖ్య మరింత పెరిగింది.
గత 6 నెలల్లో ఒక్క రోజులో నమోదైన కేసులు ఇవే కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ 2న ఒకే రోజులో 3,375 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు కోవడ్ మహమ్మారికి బలయ్యారు. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, స్పెషలిస్ట్ వైద్యులతో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతారు.
గత ఏడాది జనవరి, మార్చి మధ్య మూడవ వేవ్ సమయంలో కోవిడ్ రోగులలో ఇలాంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు ఇంకా కోవిడ్ రోగుల రద్దీ పెరగలేదన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు.
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కు కూడా చేరదు.. మాజీ క్రికెటర్ జోస్యం
Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి