Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 29వేల కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. దీంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 16న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 29,164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 449 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291 కి చేరగా.. మరణాల సంఖ్య 1,30,519 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: Bharat Biotech: కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిన్న కరోనా ( Coronavirus ) నుంచి 40,791 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 82,90,371 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,53,401 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.42 శాతం ఉండగా.. మరణాల రేటు 1.47 శాతం ఉంది. Also read: Krithi Shetty: చూపులతో చంపేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి


ఇదిలాఉంటే.. సోమవారం దేశవ్యాప్తంగా 8,44,382 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 16వ తేదీ వరకు దేశంలో మొత్తం 12,65,42,907 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది.


 


Also read: Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి