India Covid-19: కరోనావైరస్ అప్డేట్స్.. గత 24గంటల్లో 333 మంది మృతి
భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సోమవారం 20వేలకు తక్కువగా నమోదైన కేసులు.. కాస్త మళ్లీ పెరిగాయి.
India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సోమవారం 20వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో మంగళవారం (డిసెంబరు 22న) కొత్తగా 23,950 కరోనా కేసులు నమోదు కాగా.. 333 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 కి చేరగా.. మరణాల సంఖ్య 1,46,444 కి పెరిగింది.
ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా (Coronavirus) నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం కరోనా నుంచి 26,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 96,63,382 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌గా (active cases) 2,89,240 కరోనా కేసులు ఉన్నాయి. Also read: Bhutan: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్డౌన్
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 10,98,164 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 22వ తేదీ వరకు మొత్తం 16,42,68,721 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also read: Narendra Modi: ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రతిఫలాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook